- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tadipatri | పేకాటాడుతున్న వ్యక్తుల అరెస్ట్
by Thanuru Gopichand |
పేకాట స్థావరంపై దాడి చేసిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : పేకాట స్థావరంపై దాడి చేసిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం తాడిపత్రిలోని ఓ తోటలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. వారి గురించిన సమాచారం పోలీసులకు అందింది. దీంతో వారు అక్కడకు చేరుకొని తనిఖీలు చేశారు. అనంతరం పేకాటాడుతున్నట్లు గుర్తించి దాడులు నిర్వహించారు. సంఘటనా స్థలం నుంచి రూ.89వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఓ ప్రధాన పార్టీకి చెందిన నేత అయిన కాకర్ల రంగనాథ్ తోటలో పేకాట స్థావరాన్ని గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎవరూ కూడా పేకాట ఆడవద్దని.. ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story






