అనంతపురంలో ఉద్రిక్తత.. టీడీపీ నాయకురాలు తేజస్విని కారుపై రాళ్ల దాడి

by Vemula.Srinu Prasad |

అనంతపురంలో టీడీపీ నాయకురాలు తేజస్విని కారుపై రాళ్ల దాడి జరిగింది..

అనంతపురంలో ఉద్రిక్తత.. టీడీపీ నాయకురాలు తేజస్విని కారుపై రాళ్ల దాడి
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Anantapur)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సూపర్ సిక్స్..సూపర్ సక్సెస్(Super six..super success) కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ(Tdp) నాయకురాలు తేజస్విని(Tejaswini) కారుపై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని తేజస్విని ఆరోపించారు. దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ దాడిని ఖండించారు. వైసీపీ నేతల పనేనని మండిపడ్డారు. ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తీరుమార్చుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story