Satyasai District | గుప్త నిధుల కోసం తవ్వారు.. గ్రామస్తులకు పట్టుబడ్డారు

by Thanuru Gopichand |

శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలోని ధనియానిచెరువు గ్రామంలో గుప్తనిధుల ముఠాను గ్రామస్తుల సహాయంతో పోలీసులు పట్టుకున్నారు.

Satyasai District | గుప్త నిధుల కోసం తవ్వారు.. గ్రామస్తులకు పట్టుబడ్డారు
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలోని ధనియానిచెరువు గ్రామంలో గుప్తనిధుల ముఠాను గ్రామస్తుల సహాయంతో పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించిన గ్రామస్తులు గుడిని చుట్టుముట్టారు. గ్రామస్తుల రాకతో వారి అలికిడి విన్న గుప్త నిధుల తవ్వకాల ముఠా సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గ్రామస్తులు వారిని వెంబడించారు. ముఠా సభ్యుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు మరో ముగ్గురు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఉన్న గాలివీడుకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Next Story