సత్య సాయి బాబా జయంతి వేడుకలు : మంత్రుల బృందం సమావేశం

by Thanuru Gopichand |

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 100వ జయంతి వేడుకల ఏర్పాట్లపై పుట్టపర్తిలో (Puttaparthi) మంత్రుల బృందం సమావేశం జరిగింది.

సత్య సాయి బాబా జయంతి వేడుకలు : మంత్రుల బృందం సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 100వ జయంతి వేడుకల ఏర్పాట్లపై పుట్టపర్తిలో (Puttaparthi) మంత్రుల బృందం సమావేశం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నవంబరు 19న పుట్టపర్తి సందర్శించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రుల బృందం (Ministers Group) చర్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అత్యంత ఘనంగా, ఆధ్యాత్మిక వైభవానికి తగిన రీతిలో నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు బృందంలోని మంత్రులు పేర్కొన్నా. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.

శతజయంతి వేడుకలకు సిద్ధమైన పుట్టపర్తి

శ్రీ సత్యసాయి బాబా (Satya Sai Baba) శతజయంతి వేడుకలకు పుట్టపర్తి సిద్ధమైంది. ఈసారి కూడా ఆయన జయంతి రోజున విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సత్యసాయి నిలయంలో శతజయంతి వేడుకలు పది రోజులపాటు రాష్ట్ర పండుగగా జరపాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 13 నుంచి 23 వరకు అధికారికంగా వేడుకలను నిర్వహించనుంది. ప్రశాంతి నిలయంలో జరగనున్న ఈ ఉత్సవాలకు దాదాపు ఐదు లక్షల మందికి పైగానే హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. ఆ మేరకు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు (Sri Satya Sai Central Trust) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

19న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

నవంబరు 19న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తో సహా ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వేలాది మంది భక్తులు ప్రతినిధులు శత జయంతి వేడుకలకు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రులు, వివిఐపీలు, దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఒ కపక్క రాష్ట్ర ప్రభుత్వం, సత్య సాయి నిలయంలో సెంటర్ ట్రస్ట్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Next Story