- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Puttaparthi | భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం : ఎస్పీ
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతోత్సవాలను పురస్కరించుకొని వీవీఐపీలు, విదేశాలకు చెందిన అతిథులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వారు వస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతోత్సవాలను పురస్కరించుకొని వీవీఐపీలు, విదేశాలకు చెందిన అతిథులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వారు వస్తున్నారు. కాబట్టి భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నాం అని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. టెంపుల్ ప్రవేశం, బయటకు వెళ్లేదారులను ఇప్పటికే గుర్తించామన్నారు. అక్కడ రెండు విభాగాలుగా భద్రత ఏర్పాట్లను చేశామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచే కాకుండా బయట నుంచి అదనగా 2500ల బలగాలు, స్పెషల్ పార్టీస్, గ్రే హౌండ్స్ సిబ్బందిని పిలిపిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి కూడా ఇక్కడకు రానున్నారని తెలిపారు. రోడ్ ఓపెన్ పార్టీస్, ఏరియా డామినేషన్ లకు ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు.
దిల్లీలో జరిగిన బాంబు పేలుడు నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. కర్నాటక నాగేపల్లి జంక్షన్, బ్రాహ్మణపల్లి ఏరియా దారుల్లో మామిలకుంట క్రాస్ దగ్గర 24 గంటలు వాహన తనిఖీలు చేపడుతున్నాం అన్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తరువాతే లోపలికి పంపిస్తున్నామని తెలియజేశారు. 330 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. 10 డ్రోన్స్ వరకు వినియోగంలోకి తీసుకువచ్చామన్నారు. ప్రతి ఇంటికి వెరిఫికేషన్ కోసం వెళ్తున్నామన్నారు. అలా ఒక రౌండ్ పూర్తి చేశామన్నారు. ప్రత్యామ్నాయ రోజుల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నామన్నారు.
అనంతపూర్-బెంగళూరు, కదిరి-చెన్నై, కడప-పులివెందుల నుంచి వచ్చే బస్సులకు సపరేట్ డ్రాపింగ్ పాయింట్స్ ఇచ్చామన్నారు. బ్రాహ్మణపల్లి రోడ్డులోని శిల్పారామం ఎదురుగా సుమారు 35 ఎకరాల స్థలం ఉందన్నారు. అక్కడ ఒక ఐదు పార్కింగ్ స్థలాలను గుర్తించామని తెలిపారు. వైజంక్షన్ నుంచి కమ్మవారిపల్లి జంక్షన్ వైపు కూడా వేలాది వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలాన్ని గుర్తించామని తెలియజేశారు. డ్రాంపింగ్ పాయింట్ టెంపుల్ నుంచి కిలోమీటర్ లోపలే ఉంటుందన్నారు. డ్రాప్ చేసిన తరువాత పార్కింగ్ కు వెళ్లేందుకు కావాల్సిన సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. హెలికాప్టర్లు ఎక్కువ వస్తే వాటిని కడప ఎయిర్ పోర్టుకు గానీ, బెంగళూరు ఎయిర్ పోర్టుకు గానీ డైవర్ట్ చేసి.. అక్కడి నుంచి ఉత్సవాలకు తీసుకొచ్చే ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.






