Puttaparthi | 9.2 కిలోల బంగారంతో శ్రీ సత్యసాయి విగ్రహం

by Thanuru Gopichand |

శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి (Puttaparthi) ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మంగళవారం శ్రీ సత్యసాయిబాబా (Sri Sathya Saibaba) శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Puttaparthi | 9.2 కిలోల బంగారంతో శ్రీ సత్యసాయి విగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి (Puttaparthi) ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మంగళవారం శ్రీ సత్యసాయిబాబా (Sri Sathya Saibaba) శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 9.2 కిలోల బంగారంతో శ్రీ సత్యసాయి విగ్రహాన్ని (Golden Idol) రూపుదిద్దారు. ఈ ఉత్సవ విగ్రహాన్ని 31.8 అడుగుల ఎత్తయిన వెండి రథంలో ప్రతిష్టించి పట్టణ వీధుల్లో ఊరేగించారు. రథం తయారీలో 180 కిలోల వెండి, కిలో బంగారాన్ని పూతగా వినియోగించారు.

ఉత్సవాల్లో భాగస్వాములయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు కూడా శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసి ఉన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఉత్సవ సేవల్లో భాగస్వాములు అవుతున్నారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిపర్తికి విచ్చేయనున్నారు.

Next Story