Good News: త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు పంపిణీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-01 13:53:03  IST  )

త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు అందజేస్తామని మంత్రి సబిత తెలిపారు..

Good News: త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,190 మందికి స్పౌజ్ పెన్షన్లు అందజేశామని మంత్రి సవిత తెలిపారు. అనంతపురం జిల్లా రొద్దం మండలంసానిపల్లిలో లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి సవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 435 మందికి, పెనుకొండ నియోజకవర్గంలో 56 మందికి స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. ఇంకా అర్హులున్నారని, వారందరికీ త్వరలో అందజేస్తామని తెలిపారు. పెన్షన్లతో పాటు ఇళ్లులేని పేదలకు సొంతిల్లు కట్టించి ఇస్తామని, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు.పెనుకొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 18 విలేజ్ క్లినిక్‌లకు కూటమి ప్రభుత్వం రూ.10.50 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు.


నల్లూరులో రూ.20 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మిస్తున్నామని సబిత పేర్కొన్నారు.. వాటితో పాటు రొద్దంలో రూ.8.50 కోట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత 73 అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తొమ్మిది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, 44 గోకులం షెడ్లు నిర్మించామన్నారు. నల్లూరు నుంచి కల్లుకుంట్ల కు రూ.4.50 కోట్ల వంతెన నిర్మించామన్నారు. కల్లుకుంట్ల నుంచి పెద్దగువ్వలపల్లి వరకూ 75 లక్షలతో సీసీ రోడ్డు, డీఆర్ కొట్టాలలో రూ.2.03 కోట్లతో వంతెన, రోడ్డు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు.

Next Story