అలా చేసిన ఏకైక సీఎం జగన్: ఎంపీ తలారి

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-01-08 16:07:54  IST  )

సంక్షేమానికి లక్షల కోట్లు కేటాయించిన ఏకైక సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు...

అలా చేసిన ఏకైక సీఎం జగన్: ఎంపీ తలారి
X

దిశ, కళ్యాణదుర్గం: ప్రజా సంక్షేమానికి లక్షల కోట్లు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అని జిల్లా ఎంపీ, కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పేర్కొన్నారు. కంబదూరు, కుందుర్పి మండల కేంద్రాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల ప్రభుత్వం పెంచిన పింఛన్లను రూ. 2,750 నుంచి రూ. 3,000కు పెంచడంతో వృద్ధులకు వితంతులకు ఆయన పింఛన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు మోసపూరిత హామీలతో ముందుకు వస్తారని, ప్రజలు వాటిని నమ్మవద్దన్నారు. రాబోయేది జగనన్న రాజ్యమే అని ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు.

Next Story