- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి సత్యకుమార్ మంచి మనసు.. 2,087 మంది టెన్త్ విద్యార్థుల ఫీజు చెల్లింపు
మంత్రి సత్యకుమార్ మంచి మనసు చాటుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar Yadav) మంచి మనసు చాటుకున్నారు. పదో తరగతి చదువుతున్న పేద విద్యార్ధుల ఫీజును ఆయన చెల్లించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,087 మంది పదో తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల ఫీజును స్వయంగా ఆయనే చెల్లించారు. ఒక్కొక్క విద్యార్థికి రూ.125 చొప్పున ఫీజును విద్యా శాఖకు చెల్లించాలి. జిల్లా విద్యా శాఖ అధికారి ద్వారా మొత్తం రూ.2,60,875 మొత్తాన్ని మంత్రి సత్యకుమార్ అందజేశారు. ఈ మేరకు ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియచేస్తూ ఉత్తర్వులిచ్చారు.
కాగా ధర్మవరం నియోజకవర్గంలో బత్తలపల్లి, దర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లోని 41 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ఈ పాఠశాలలో మొత్తం 2,087 మంది పదో తరగతి చదువుతున్నారు. త్వరలో వీరంతా పబ్లిక్ పరీక్షలు రాయ బోతున్నారు. ఈ మేరకు విద్యార్థుల ఫీజును ప్రోత్సాహకంగా మంత్రి సత్యకుమార్ చెల్లించారు. వీరిలో1,096 మంది బాలికలు ఉండటం విశేషం.






