సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను సన్మానించిన మంత్రి సత్యకుమార్

by Thanuru Gopichand |

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను సన్మానించిన మంత్రి సత్యకుమార్
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలోని చిన్న టేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం అందరి మనసులను కలచివేసింది. ఆ భయానక ఘటన ఇప్పటికీ అందరి మదిలో మెదులుతోంది. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించాలంటేనే భయపడేలా చేస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు కొందరు యువకులు వీలైనంత మంది క్షతగాత్రులను కాపాడేందుకు ప్రయత్నించారు. అటువంటి వారిలో ధర్మవరంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు హరీశ్ కుమార్, జ్ఞానేంద్ర, మణిదీప్, వంశీలు ఉన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వారి నివాసాలకు స్వయంగా వెళ్ళారు. వారిని శాలువా కప్పి గౌరవప్రదంగా సత్కరించారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లయిన ధర్మవరం యువకులు చేసిన పని మానవత్వానికి అద్దం పడుతుందన్నారు. తమకు ఏం జరుగుతుందో అనే భయం లేకుండా క్షతగాత్రులకు వారు చేసిన సాయం అభినందనీయమన్నారు. వారి సేవాభావం ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు చేసిన సేవ గొప్పది అని, అది ఇతరులకు స్ఫూర్తిదాయకమైందని చెప్పారు. ప్రతిఒక్కరూ మానవతా విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కోరారు.

Next Story