- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ananthapuram:వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్
by Jakkula.Mamatha |
కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుమార్తె వివాహ వేడుకకు ఏపీ(Andhra Pradesh) విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

X
దిశ,వెబ్‌డెస్క్:కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుమార్తె వివాహ వేడుకకు ఏపీ(Andhra Pradesh) విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ క్రమంలో అనంతపురంలో మంత్రి నారా లోకేష్‌కు జన నీరాజనం పలికారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తపోవనం సర్కిల్ లో గజమాలతో ఘన స్వాగతం పలికారు.
అనంతపురం(Ananthapuram) పట్టణం శ్రీనగర్ కాలనీలోని జీఎంఆర్ కాంపౌండ్‌లో జరిగిన వివాహ మహోత్సవం లో పాల్గొని నూతన వధూవరులను శ్రీచరిత, రాహుల్ ఆదిత్యలను మంత్రి(Minister Nara Lokesh) ఆశీర్వదించారు. పుష్పగుచ్చం అందించి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్.సవిత, ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కాల్వ శ్రీనివాసులు తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Next Story






