Nellore Politics: దమ్ము, ధైర్యం ఉంటే ప్రమాణం చేద్దాం.. రా..!

by srinivas |   ( Updated:2023-02-04 11:09:26.0  )
Nellore Politics: దమ్ము, ధైర్యం ఉంటే ప్రమాణం చేద్దాం.. రా..!
X

దిశ, అనంతపురం:తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, అందులో ఎవరు ఎక్కినా మునిగిపోక తప్పదని వ్యవసాయ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి హెచ్చరించారు. అనంతపురంలో రాయలసీమ రైతు ఉత్పత్తిదారుల సంస్థల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్థన్ రెడ్డి ...సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు చేస్తున్న శ్రీధర్ రెడ్డి సవాల్ విసిరారు. తన ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి లబ్ధి పొందలేదని ఈ నెల 6న నెల్లూరులో తాను ప్రమాణం చేస్తానని, దమ్ము ధైర్యం ఉంటే శ్రీధర్ రెడ్డి కూడా ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు.

నెల్లూరు జిల్లాలో తిరిగి టికెట్లు రాని వారే టీడీపీలో చేరుతున్నారన్నారు. టిక్కెట్ రాదని భావించే నేతలే వైఎస్సార్ కాంగ్రెస్‌ను వీడుతున్నారన్నాని చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక విశ్వాసఘాతకుడని మండిపడ్డారు. ఒక పార్టీలో గెలిచి.. మరో పార్టీకి వత్తాసు పలుకుతున్నాడని ధ్వజమెత్తారు. 'కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక నమ్మకద్రోహి అని, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దె రకం. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి జగన్ బీఫాం ఇవ్వకపోతే ఆయన జన్మలో ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు. నెల్లూరు మేయర్ కోటంరెడ్డి వెంటే ఉంటానన్న వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. ఎమ్మెల్యే పోతేనే పట్టించుకోవడంలేదని.. ఇక మేయర్ ఎంత అని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు.

READ MORE

Pawan Kalyan టీడీపీ సీనియర్ కార్యకర్త: Minister Amarnath

Next Story

Most Viewed