Teacher Mlc Electionలో విజేతగా ఎంవీ రామచంద్రారెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-17 10:04:36  IST  )

కడప-అనంతపురము-కర్నూల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో అత్యధిక ఓట్లు సాధించిన ఎంవీ రామచంద్రా‌రెడ్డిని విజేతగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు...

Teacher Mlc Electionలో విజేతగా ఎంవీ రామచంద్రారెడ్డి
X

డైనమిక్ బ్యూరో, అనంతపురం: కడప-అనంతపురము-కర్నూల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో అత్యధిక ఓట్లు సాధించిన ఎంవీ రామచంద్రా‌రెడ్డిని విజేతగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు. జేఎన్టీయులో ఏర్పాటు చేసిన మీడియా ప్రాంగణం వద్ద ఎంవీ రామచంద్రారెడ్డికి ఆమె ధ్రువీకరణ పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నారు. ఎన్నికలో ప్రాథమిక ఓట్ల బదిలీ చేస్తూ పోగా చివరికి ఇద్దరు అభ్యర్థులు ఎంవీ రామచంద్రారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులురెడ్డి పోటీలో నిలిచారన్నారు. ఈ ఎన్నికలో ప్రాధాన్యత ఓట్ల బదిలీ అనంతరం ఎవరికీ 50 శాతం పైగా ఓట్లు దక్కలేదని, నిబంధనల ప్రకారం అత్యధిక ఓట్లు సాధించిన ఎంవీ రామచంద్రా రెడ్డిని విజేతగా ప్రకటించామని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు.

సంపూర్ణ ప్రాధాన్యత ఓట్ల బదిలీ అనంతరం ఎంవీ రామచంద్రారెడ్డి 10,787 ఓట్లు పొందారన్నారు. తన సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసులురెడ్డికి 10,618 ఓట్లు పోలయ్యాయన్నారు. మొత్తం 25,272 ఓట్లు పోలవ్వగా, వాటిలో 3,867 ఓట్లు చెల్లని ఓట్లు,ప్రాధాన్యత బదిలీ అనంతరం విలువ కోల్పోయిన ఓట్లుగా మిగిలాయన్నారు.

Next Story