- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం : మంత్రి సవిత
టీడీపీతోనే కురబలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీతోనే కురబలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలోనే గుడికట్ల పూజారులకు (Gudikatla Poojarulu) గౌరవ వేతనంగా అందజేయనున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కురబలకు ఎన్టీయే (NDA) కూటమి ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చితీరుతామని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చిన మేరకు భక్త కనకదాస జయంతికి సంబంధించి శాశ్వత జీవో తీసుకొచ్చామన్నారు. హామీని నెరవేర్చినందుకు మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)కు ధన్యవాదాలు తెలియజేశారు. శాశ్వత జీవోలో భాగంగా మొదటి రాష్ట్ర స్థాయి కనకదాస జయంతికి (Kanakadasa Jayanthi) మంత్రి నారా లోకేశ్ హాజరుకావడం ఆనందకర విషయమన్నారు. త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు దేవాలయాల నిర్వహణ కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు. గొర్రెల యూనిట్ల ఏర్పాటుకు స్వయం ఉపాధి రుణాలు అందజేస్తామన్నారు. ఆదరణ 3.0 (Aadarana 3.0) అమలులో భాగంగా గొర్రెల సంరక్షణకు అధునాతన ఫెన్సింగ్, ఎల్ఈడీ బల్పులు అందజేస్తామన్నారు. తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఇదే విషయమై ఇప్పటికే టీటీడీ చైర్మన్ తో మంత్రి నారా లోకేశ్ మాట్లాడారన్నారు. అంతకుముందు భక్త కనకదాస జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కురబ సామాజిక వర్గీయులు, పలువురు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






