అనంతపురంలో తుపాకుల కలకలం.. చివరి నిమిషంలో తప్పించుకున్న కీలక వ్యక్తులు

by Vemula.Srinu Prasad |

అనంతపురంలో తుపాకులు కలకలం రేపాయి....

అనంతపురంలో తుపాకుల కలకలం.. చివరి నిమిషంలో తప్పించుకున్న కీలక వ్యక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Ananthapur)లో తుపాకులు(:Guns) కలకలం రేపాయి. చిన్న వివాదంలో దంపతులను స్థానిక జిమ్ ఓనర్ రాజశేఖర్ గన్‌తో బెదిరించారు. దీంతో పోలీసులకు భార్య చేశారు. ఈ మేరకు ఎస్పీ కూపీలాగారు. జిమ్ ఓనర్ రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తుపాకీ ఎక్కడిదనే కోణంలో విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా గన్స్‌ సప్లై చేస్తున్నట్లు తేలింది. మొత్తం నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరిని అదుపులోకి నాలుగు రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో గన్స్ సప్లై చేసే ముఠాలోని కీలక వ్యక్తులు తప్పించుకున్నారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

Next Story