- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anantapur: కుక్కర్ పేలి నలుగురు చిన్నారులకు గాయాలు
అనంతపూర్ జిల్లా కంబదూరు మండలం ములకనూరు అంగన్‌వాడీ కేంద్రంలో ప్రమాదం జరిగింది ...

X
దిశ, కళ్యాణదుర్గం: అనంతపూర్ జిల్లా కంబదూరు మండలం ములకనూరు అంగన్‌వాడీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. వంట కుక్కర్ పేలి నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంగన్‌వాడీ కేంద్రంలో వంట చేసే సమయంలో కుక్కర్ పేలింది. అంతేకాదు పక్కనే ఉన్న పిల్లలపై ఎగిరి పడింది. అయితే ఈ ఘటనను అంగన్వాడీ నిర్వాహకులు రహస్యంగా ఉంచారని స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీడీపీవో వనిజ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






