పవన్ మంచోడు కాబట్టి ఊరుకున్నారు.. లేకపోతేనా: జేసీ ప్రభాకర్ రెడ్డి

by srinivas |   ( Updated:2024-12-29 05:17:29.0  )
పవన్ మంచోడు కాబట్టి ఊరుకున్నారు.. లేకపోతేనా: జేసీ ప్రభాకర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) కుటుంబంపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే గతంలో పేర్ని నాని చేసిన అరాచకాలను తెలుపుతూ తాడిపత్రి(Tadipatri)లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) విమర్శలు కురిపించారు. గతంలోనే తనను టార్గెట్ చేసి పేర్ని నాని కేసులు పెట్టించినప్పుడు ఏమైంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్నినానికేనా పిల్లలు.. తమకు లేరా అంటూ ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నానికి ఆడవాళ్లు గుర్తుకురాలేదా అని నిలదీశారు. ‘‘పవన్ కల్యాణ్(Pawan Kalyan) నాలుగు పెళ్లిళ్లు చేసికుంటే నీకేంది..?. విడాకులు తీసుకుని చేసుకుంటారు. విక్టోరియా ఎవరో బందరో, మచిలీపట్నంలో అడుక్కో పో. పవన్ మంచోడు కాబట్టి ఊరుకున్నారు. ఆయన దగ్గర మనుషులు తక్కువ ఉంది కాదు. పాపం పవన్‌ను ఎన్ని మాటలన్నారు. నారా చంద్రబాబు(Nara Chandrababu)ను దూషిస్తారా..?, భువనేశ్వరి(Bhuvaneswari) గురించి అసెంబ్లీలో ఎన్ని మాటలు అన్నారు. చంద్రబాబు మమ్మల్ని ఆపారు. లేకుంటే మా కార్యకర్తలు తాట తీసేవారు. మీ ఆడవాళ్లు గురించి మాట్లాడితే చాలా ఉంది. సభ్యత ఉంది కాబట్టి మాట్లాడటంలేదు. నీ బ్యాటరీ వీక్ అయింది. చూసుకో.’’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి సెటైర్లు వేశారు.

Next Story

Most Viewed