పదేళ్లుగా సైలెంట్.. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే కుటుంబం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-01 10:30:54  IST  )

రీ ఎంట్రీకి అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి రెడీ అయ్యారు..

పదేళ్లుగా సైలెంట్.. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే కుటుంబం
X

దిశ, వెబ్ డెస్క్: పదేళ్ల క్రితం చక్రం తిప్పారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మీడియాతో తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. ఆయన ఎవరో కాదు అనంతరంపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి. గతంలో ఆయన వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత జగన్‌తో కలిసి పని చేశారు. పదేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి..

అయితే తాను, తన కుటుంబం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు అమర్నాథ్ రెడ్డి తాజాగా స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నామని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తామని గుర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఇక నుంచి ప్రజలతో కలసి పని చేస్తామని చెప్పారు. గత పాలనను అనంతపురం అర్బన్‌లో చూపిస్తామని గుర్నాథ్ రెడ్డి తెలిపారు.

Next Story