FIFA World Cup : ట్రెండింగ్‌లో ఎస్‌బీఐ పాస్‌బుక్ కవర్ ఫోటో!

by Dishanational2 |
FIFA World Cup : ట్రెండింగ్‌లో ఎస్‌బీఐ పాస్‌బుక్ కవర్ ఫోటో!
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ సందడి నడుస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ పాస్‌బుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు..ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తెగ హడావుడి చేసేస్తున్నారు. భారత్‌ ఓడిపోయినా కూడా ఫుట్‌బాల్ మ్యాచ్‌‌పై ఉన్న ఆసక్తితో అభిమానులు విదేశీ జట్టుల ఆట తీరును కూడా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో క్రొయేషియాపై అర్జెంటీనా విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

దీంతో, ట్విట్టర్ వేదికగా అర్జెంటీనా ఫ్యాన్స్‌ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో 'ఎస్బీఐ'పాస్‌బుక్‌ కవర్ ఫోటోలు వైరల్‌ అవుతోన్నాయి. దీనికి కారణం, అర్జెంటీనా జాతీయ జెండా, ఎస్బీఐ పాస్‌బుక్‌ రంగులు ఒకటే కావడం!. అయితే ఎస్బీఐ పాస్‌బుక్‌ కవర్‌ ఫొటో అచ్చం అర్జెంటీనా జెండా మాదిరి ఉంటుంది. దీంతో, ఎస్బీఐ కూడా అర్జెంటీనాను సపోర్ట్‌ చేస్తోందని నెటిజన్లు ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. అర్జెంటీనాకు మద్దతు పలుకుతూ ఇండియన్స్ చేస్తున్న ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మ్యాచ్‌ సందర్భంగా మీకు అర్జెంటీనా జెండా అందుబాటులో లేకపోతే ఎస్బీఐ పాస్‌బుక్‌ను వాడుకోండని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా...ఇక వరుసగా ట్వీట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో, ఎస్బీఐ పాస్‌బుక్ ఫోటో ట్రెండ్ అవుతుందనే చెప్పాలి.



Next Story

Most Viewed