- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ananthapur జిల్లాలో విద్యుత్ కోసం రోడ్డెక్కిన రైతులు
by Vemula.Srinu Prasad |
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ..

X
దిశ, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కనీసం 7 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడంలేదని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి 9 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి కుమారుడు టీడీపీ యువ నేత డాక్టర్ ఉన్నం మారుతీ చౌదరి మద్దతు తెలిపారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల ప్రభుత్వం అని మాటల్లో చెప్పుకోవడం కాదని చేతుల్లో చూపించాలని ఆయన విమర్శించారు. గడప గడపకు వెళ్లి అక్కడ చెప్పే మాటలన్నీ అబద్దాలేనని వ్యాఖ్యానించారు. అనంతరం విద్యుత్ ఈఈ హామీ మేరకు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాము, గరికపాటి నవీన్, పాలవాయి, భట్టువానిపల్లి రైతులు పాల్గొన్నారు.
Next Story






