- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకన్న కొండ గుహలో గుప్తనిధుల తవ్వకాలు.. నిందితుడి అరెస్ట్
by Vemula.Srinu Prasad |
శ్రీసత్యసాయి జిల్లా మాదిరెడ్డిపల్లి సమీపంలోని వెంకన్న కొండ గుహలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వ్యక్తిని స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) మాదిరెడ్డిపల్లి(Madireddypalli) సమీపంలోని వెంకన్న కొండ గుహ(Venkanna Hill Cave)లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వ్యక్తిని స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొంతకాలంగా ఈ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు గమనిస్తున్న గ్రామస్థులు, గుహలో తవ్వకాలు జరుపుతున్న వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలసులు తవ్వకాల కోసం నిందితుడు ఉపయోగిస్తున్న అత్యాధునిక పరికరాలను, పని ముట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పురాతన కట్టడాలు, గుహల్లో తవ్వకాలు జరపడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు.
Next Story






