- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కదిరి జనసేన ఇన్ఛార్జిపై గృహహింస కేసు..
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో జనసేన పార్టీకి చెందిన నేత ఇంటిలోని కలహాలు.. పోలీస్ స్టేషన్ కు చేరాయి.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో జనసేన పార్టీకి చెందిన నేత ఇంటిలోని కలహాలు.. పోలీస్ స్టేషన్ కు చేరాయి. నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి భైరవ ప్రసాద్ పై అతని కూతురు, భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై శారీరక, మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనసేన నేతపై కేసు నమోదవ్వడంతో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. భైరవ ప్రసాద్ కొంతకాలంగా.. ఇంట్లో భార్య, కూతురితో నిత్యం గొడవలు పడుతూ.. వేధింపువలకు గురిచేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొడవలు మరింత పెరగడంతో.. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గొడవలు మరింత ఎక్కువవ్వడం, వేధింపులు తీవ్రంకావడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. తన భర్త నుంచి తమకు ప్రాణభయం ఉందని, తగిన రక్షణ కల్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భార్య శశికళ కదిరి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జనసేన నేత భైరవ ప్రసాద్‌పై గృహహింస, దాడి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కుటుంబ కలహాలకు గల అసలు కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.






