గవర్నర్‌ను కలిసిన DGP శివధర్ రెడ్డి.. శాంతిభద్రతలపై ఆరా

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-01 09:09:21  IST  )

తెలంగాణ కొత్త డీజీపీగా బత్తుల శివధర్‌ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

గవర్నర్‌ను కలిసిన DGP శివధర్ రెడ్డి.. శాంతిభద్రతలపై ఆరా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కొత్త డీజీపీగా బత్తుల శివధర్‌ రెడ్డి (Shivadhar Reddy)ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆయన లక్డీకాపూల్‌ (Lakdi-Ka-Pool)లోని డీజీపీ కార్యాలయంలో ఉదయం 9.44 నిమిషాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ప్రెస్‌మీట్ నిర్వహించిన అనంతరం ఆయన నేరుగా రాజ్‌భవన్‌ (Raj Bhavan)కు వెళ్లారు. అక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. డీజీపీ శివధర్ రెడ్డి వెంట హైదరాబాద్ సీపీ సజ్జనార్, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్ కూడా ఉన్నారు. అనంతరం జరిగిన భేటీలో గవర్నర్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

Next Story