- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
CPI: ఆ స్థలాన్ని కాపాడండి... సీఎం జగన్‌కు లేఖ

దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం నగరం నడిబొడ్డున దాదాపు రూ.200 కోట్లు విలువగల మిస్సమ్మ కాంపౌండ్ (సీఎస్ఐ) స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. 7 ఎకరాల 67 సెంట్లు సీఎస్ఐ చర్చి స్థలాన్ని కబ్జా చేసేందుకు 2007 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని లేఖలో ఆరోపించారు. బీఎన్ఆర్ సోదరులు ఆయా భూములలో నివాసం ఉంటున్న పేదలను, విద్యాసంస్థలను ఖాళీ చేయించేందుకు పలుమార్లు దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారని లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో బీఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్ ఆగడాలకు అడ్డుకట్ట వేశారని గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం బీఎన్ఆర్ సోదరులు దొంగ పత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఈ ఘటనపై చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు కోర్టులో కేసు వేసినట్లు లేఖలో తెలిపారు. కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఆయా భూములలో ఎలాంటి చట్ట విరుద్ధమైన అక్రమ కట్టడాలు జరగకుండా సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు, విద్యాసంస్థలకు రక్షణ కల్పించవలసిందిగా పోలీసు అధికారులను ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ సీఎం జగన్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.