- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sriharikota: బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్
శ్రీహరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్

దిశ, వెబ్‌డెస్క్: శ్రీహరికోటలో బాహుబలి రాకెట్(Bahubali Rocket) ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు(ఆదివారం) సాయంత్రం 5:26 గంటలకు LVM3-M5 రాకెట్ ప్రయోగం జరుగనుంది. ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ 24గంటల సమయం పాటు నిర్విరామంగా కొనసాగిన తర్వాత సరిగ్గా నవంబర్ 2న సాయంత్రం ఐదు గంటల ఇరువై ఆరు నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగురుతుంది. అయితే ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శ్రీహరికోటలోని రెండో లాంచ్ ప్యాడ్ వద్ద రాకెట్ ప్రయోగ రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు. వాతావరణం కనుక అనుకూలిస్తే శాస్త్రవేత్తలుఅనుకున్న ప్రకారం ఈ భారీ బహుబలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తలు షార్ నుండి ఇప్పటివరకు ఇంత బరువు కలిగిన ఉపగ్రహాన్ని పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం అయితే ఇస్రో మరో మైలు రాయిని చేరుకుంటుంది.






