పుట్టపర్తిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

by Thanuru Gopichand |

శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో (Puttaparthi) శ్రీ సత్యసాయి బాబా శత వార్షికోత్సవాలు జరుగుతున్నాయి.

పుట్టపర్తిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో (Puttaparthi) శ్రీ సత్యసాయి బాబా శత వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో (Prashanti Nilayam) వేడుకలను నిర్వహిస్తున్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు ఉత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ శనివారం రాత్రి ఆకస్మిక పర్యటన (Sudden Visit) నిర్వహించారు. పుట్టపర్తిలోని సత్యమ్మ గుడి సమీపంలో పరిసరాలను పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా పారిశుద్ధ్య పనులు, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత అంశాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ​ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ క్రాంతి అక్కడ జరుగుతున్న పనుల గురించి కలెక్టర్‌కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మరింత మెరుగైన పారిశుద్ధ్యం పాటించాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వార్షికోత్సవాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story