నేడు పుట్టపర్తికి సీఎం.. డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |

పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా (Sri Satya Sai Baba) శతజయంతి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్నాయి.

నేడు పుట్టపర్తికి సీఎం.. డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా (Sri Satya Sai Baba) శతజయంతి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు వేడుకలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి (Puttaparthy) అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టపర్తికి విచ్చేయనున్నారు. పుట్టపర్తికి రానున్న వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, సత్యకుమార్ తదితరులు ఉన్నారు.

రేపు పుట్టపర్తికి ప్రధాని రాక..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) రేపు పుట్టపర్తికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను చేసేందుకు, రవాణా సౌకర్యం కోసం ముగ్గురు ఐఏఎస్ లను నియమించింది. ఐఏఎస్ అధికారులైన గోపాలకృష్ణ, గోవిందరావు, కళ్యాణ్ చక్రవర్తికి పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. సమీప జిల్లాలకు చెందని జేసీ, 9 మంది డిప్యూటీ కలెక్టర్లకు పనులను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలను జారీ చేశారు.

Next Story