AP: శ్రీకాటికోటేశ్వరస్వామి ఉత్సవాల్లో రెండు వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

శ్రీకాటికోటేశ్వరస్వామి ఉత్సవాల్లో(Srikatikoteswara Swamy festival) ఉద్రిక్తత చోటు చేసుకుంది. ..

AP: శ్రీకాటికోటేశ్వరస్వామి ఉత్సవాల్లో రెండు వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాటికోటేశ్వరస్వామి ఉత్సవాల్లో(Srikatikoteswara Swamy festival) ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామివారి గుర్రాల ప్రతిమల విషయంలో రెండు వర్గాల(Two Groups) మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పరస్పరం రాళ్లు, కర్రల(Stones and sticks)తో దాడులు(Attacks) చేసుకుంది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. మరో వర్గం స్వామి వారి గుర్రాల ప్రతిమలను ఎత్తకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ముగ్గురు వ్యక్తులు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా చిల్లవారిపల్లి(Sri Satyasai District Chillavaripalli)లో జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రత్న(SP Ratna).. చిల్లవారిపల్లికి చేరకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో మరోసారి ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Next Story