అనంతపురం జిల్లాలో యువకుడి దారుణ హత్య

by Thanuru Gopichand |

అనంతపురం జిల్లాలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఒక యువకుడి దారుణ హత్యకు దారి తీసింది. బుక్కరాయసముద్రం మండలం వీరభద్ర కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది.

అనంతపురం జిల్లాలో యువకుడి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లాలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఒక యువకుడి దారుణ హత్యకు దారి తీసింది. బుక్కరాయసముద్రం మండలం వీరభద్ర కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సాయి అనే యువకుడు బుకరాయన సముద్రం మండలం వీరభద్ర కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కాలనీలోని స్నేహితులతో సాయికి ఘర్షణ తలెత్తింది. ఏదో విషయమై వారి మధ్య వాగ్వాదం మొదలైంది. ఘర్షణ తీవ్రం కావడంతో సాయి స్నేహితులు ఆగ్రహానికి గురయ్యారు. ఆవేశంతో సాయి పై దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాలపాలైన సాయి అక్కడికక్కడే మరణించాడు. అనంతరం సాయి మృతదేహాన్ని నిందితులైన అతని స్నేహితులు సమీపంలో ఓ కెనాల్ వద్దనునన్ బావిలో పడేశారు. అయితే హత్య జరిగిన సమయంలో సాయితో పాటు అతని ముగ్గురు స్నేహితులు స్వామి మాల ధరించి ఉండడం గమనార్హం. సాయి హత్యతో కాలనీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యుల రోదనలతో వాతావరణం ఆవేదన భరితంగా మారింది. బంధుమిత్రులు, కాలనీవాసులు సాయి నివాసానికి చేరుకొని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

​ఈ దారుణమైన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పకడ్బందీ విచారణ చేపట్టగా ఈ హత్య వెనుక ధను అనే వ్యక్తి పాత్ర ఉందని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సాయిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టిన తీరు చూస్తే, నిందితులు చాలా పకడ్బందీగా ఈ నేరాన్ని అమలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్వామి మాలలు ధరించిన వ్యక్తులు ఇంతటి ఘాతుకానికి పాల్పడటంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల అసలు కారణాలు ఏమై ఉంటాయి, ఈ నేరంలో ధనుతో పాటు ఇంకెవరి ప్రమేయం ఉంది అనే కోణాల్లో లోతుగా దర్యాప్తును చేపట్టారు. త్వరలోనే ఈ కేసులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Next Story