- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
43 మంది రైతులను ముంచి.. పరార్
రైతులను మోసం చేసి పరారయిన మరో రైతు ఉదంతం అనంతపురం జిల్లా బొమ్మనహళ్‌లో జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: 43 మంది రైతులను ముంచి పరారయిన మరో రైతు ఉదంతం అనంతపురం జిల్లా(Ananthapur) బొమ్మనహళ్(Bommanahal)లో జరిగింది. ధర్గాహాన్నూరు(Dhargahannur) గ్రామానికి చెందిన రైతు మనోహర్ కొన్నేళ్లుగా వ్యవసాయం సాగు చేశారు. స్థానికంగా ఉన్న రైతుల(Former)తో పరిచయాలు పెంచుకున్నారు. అలా వ్యవసాయం పెట్టుబడి కోసం 43 మంది రైతులు, వ్యవసాయ కూలీలను నమ్మించి రూ. 40.85 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యవసాయం చేశారు. నష్టాలు వచ్చాయని చెప్పి ఉన్న ఇంటి, తన నాలుగు ఎకరాల పొలాన్ని అమ్మాడు. దీంతో తమకు ఎప్పుడు ఇస్తావని రైతులు నిలదీశారు. అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నానని, ఐపీ పెట్టి నోటీసులు ఇచ్చారు. దీంతో బాధిత రైతులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించడంతో అప్పు తీర్చుతానంటూ నమ్మబలికాడు. ఆ తర్వాత ఊరి నుంచి వెళ్లిపోయారు. దీంతో 43 మంది బాధిత రైతులు, వ్యవసాయ కూలీలు లబోదిబోమంటున్నారు.






