- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anantapuram | యువతి ఆత్మహత్యాయత్నం
కారణం ఏదైనా.. బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య సమాజంలో పెరుగుతూ ఉండడం ఆందోళనకరన పరిస్థితులకు అద్దం పడుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : కారణం ఏదైనా.. బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య సమాజంలో పెరుగుతూ ఉండడం ఆందోళనకరన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఫోన్ కొనివ్వలేదనో.. మార్కులు బాగా రాలేదనో.. భార్యాభర్తల మనస్పర్థలో ఇంకేవైనా కారణాలు కావొచ్చు.. ఇటీవల బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ఘటనలు సమాజంలో తగ్గుతున్న కుటుంబ విలువలకు, దెబ్బతింటున్న బంధాలు బంధుత్వాలను ప్రతిబింబిస్తున్నాయి. మనిషిని మనిషి అర్థం చేసుకోలేని దుస్థితిని కళ్లకు కడుతున్నాయి. అదే కోవలో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా నార్పల కొత్త బస్టాండ్ సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం వేద కృషి (22) (Veda Krushi) అనే యువతి తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఇటీవల కుటుంబంలో అభిప్రాయ బేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మనస్ఫర్థాలు పెరిగిపోవడంతో యువతి మంగళవారం ఆత్మహత్యకు యత్నించింది. భవనంపైకి వెళ్లి కిందకు దూకేస్తానని కుటుంబ సభ్యులను భయపెట్టేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతికి నచ్చజెప్పి కిందకు దించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






