- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతి లెక్కల్లో తేడాలు.. అటెండర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ సీఐ
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను వివాదంలో చిక్కుకున్నారు....

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur District) కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను(Kalyanadurg Excise CI Haseena Bhanu) వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం తన ఆఫీసులో పని చేసే అటెండర్‌ను ఆమె చెప్పుతో కొట్టారు. వైన్ షాపుల వద్ద వసూలు చేసిన డబ్బులు విషయంలో అటెండర్, సీఐ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. నెలవారీ వసూలు చేసిన డబ్బుల్లో తేడాలు రావడం, సీఐ పేరు బహిర్గతం చేయడంతో ఏకంగా ఎక్సైజ్ శాఖ అధికారుల ముందే అటెండర్‌ను చెప్పుతో కొట్టారు. తనకు ఏం తెలియదని అటెండర్ చెబుతున్నా సీఐ హసీనా భాను రెచ్చిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భానుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కల్యాణదుర్గంలోని అన్ని వైన్ షాపుల నుంచి ప్రతి నెలా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.






