- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేటలో విషాదం.. తండ్రి మృతి, కుమారుడి పరిస్థితి విషమం
by Vemula.Srinu Prasad |
చేపల వేటలో విషాదం చోటు చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: చేపల వేట(Fishing)లో విషాదం(Tragedy) చోటు చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. మదనపల్లె(Madanapalle) మండలం మేడిపల్లికి చెందిన తండ్రి నరసింహులు, తన కుమారుడితో కలిసి చేపల వేటకు వెళ్లారు. స్థానిక కాలువలో చేపల వల వేశారు. రోజూ మాదిరి వలను కాలువలో నుంచి తీసి అందులో ఉన్న చేపలను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే చేపలతో పాటు పాము కూడా వలలో ఉంది. చేపలు తీసే క్రమంలో తొలుత తండ్రిని పాము కాటు వేసింది. అనంతరం కుమారుడిని సైతం కరిచింది. దీంతో తండ్రి మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






