టీచర్ అసభ్య ప్రవర్తన.. తల్లిదండ్రులు ఏం చేశారంటే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-03 13:15:27  IST  )

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు పాల్పడ్డారు...

టీచర్ అసభ్య ప్రవర్తన.. తల్లిదండ్రులు ఏం చేశారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు పాల్పడ్డారు. పాఠం చెప్పే పేరుతో అసభ్యకరంగా ప్రవర్తించారు. భయంతో చాలా సార్లు భరించిన విద్యార్థినులు.. వేధింపులు మరీ ఎక్కువ కావడంతో అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో పేరెంట్స్ ఒక్కసారిగా స్కూలు వద్దకు వెళ్లి టీచర్‌ను చుట్టుముట్టారు. ప్రవర్తన మార్చుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లా(Ananthapur District) బ్రహ్మసముద్రంలో జరిగింది.

బ్రహ్మసముద్రం(Brahmasamudram)లోని జెడ్పీ స్కూలు(Zp School)లో వేమ నారాయణ ఉపాధ్యాయుడి(Teacher)గా పని చేస్తున్నారు. అయితే ఆయన తీరులో మార్పు వచ్చింది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వెళ్లి స్కూల్లో బైఠాయించారు. ఉపాధ్యాయుడు వేమనారాయణ పద్ధతి మార్చుకోవాలని హెడ్ మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు. లేదంటే టీచర్ పై పోలీసులకు కంప్లైంట్ చేస్తామని హెచ్చరించారు.

Next Story