సెల్ ఫోన్స్ రికవరిలో రికార్డు సృష్టించిన పోలీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-28 06:09:23  IST  )

అనంతపురం జిల్లా పోలీసులు రికార్డు సృష్టించారు...

సెల్ ఫోన్స్ రికవరిలో రికార్డు సృష్టించిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur) పోలీసులు రికార్డు సృష్టించారు. సెల్ ఫోన్ల చోరీలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చాట్ బోట్ అనే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 15 రాష్ట్రాలు, 18 జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేశారు. ఈ మేరకు12 వేల 594 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. 2022 నుంచి మొత్తం ఈ ఫోన్లను రికవరీ చేశారు. వీటి విలువ దాదాపు రూ.25 కోట్లు ఉంటుంది. చాట్ బోట్ ద్వారా ఇతర రాష్ట్రాల ఫోన్లను కూడా రికవరీ చేశారు. బాధితులందరికి ఈ ఫోన్లను అందజేశారు. ఇతర రాష్ట్రాల వాళ్లకు కొరియర్ ద్వారా అందజేశామని పోలీసులు తెలిపారు. ఫోన్లలో ఉన్న ఫొటోలు, వీడియోలు, డేటా డిలీట్ కాకుండా అలానే ఉండటంతో బాధితులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని పోలీసుల పేర్కొన్నారు.

Next Story