వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి కారుకు నిప్పు.. సీసీటీవీ ఫుటేజీలో ఘటనా దృశ్యాలు

by Ramesh Naini |

వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద ఘోర ఘటన చోటు చేసుకుంది.

వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి కారుకు నిప్పు.. సీసీటీవీ ఫుటేజీలో ఘటనా దృశ్యాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి (Punuru Gowtham Reddy) ఇంటి వద్ద ఘోర ఘటన చోటు చేసుకుంది. ఆయన ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న కారుపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి.

వివరాల ప్రకారం.. గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న కారుపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. క్షణాల్లో మంటలు ఎగసిపడగా, ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా విడుదల చేశారు. ఈ ఘటనపై వైసీపీ నేత గౌతమ్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. అయితే, ఇప్పటికే పలుమార్లు తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు ప్రయత్నించినట్లు తెలిపారు. వీడయో ఇదే..

Next Story