- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గన్నవరం మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. మరో కేసు నమోదు
ఓవైపు సత్యవర్థన్ కిడ్నాప్.. మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులతో సతమతమవుతోన్న వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఊహించిన షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: ఓవైపు సత్యవర్థన్ కిడ్నాప్ కేసు.. మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులతో సతమతమవుతోన్న వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించిన షాక్ తగిలింది. ఈ మేరకు ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గ పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్‌పై గనుల శాఖ ఏడీ, వల్లభనేని వంశీపై గన్నవరం పోలీసు స్టేషన్‌లో మొత్తం 58 పేజీలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదును అందజేశారు.
అయితే, ఆ ఫిర్యాదులో 2019 నుంచి 2024 మధ్య కాలంలో వంశీ, ఆయన వర్గం చేసిన అక్రమ తవ్వకాలపై పూర్తి ఆధారాలు ఉన్నాయి. సుమారు రూ.100 కోట్ల విలువైన సహజ వనరులను కొల్లగొట్టారని ఏడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదును స్వీకరించిన గన్నవరం పోలీసులు ఫైల్ నెంబర్ 142/2025తో ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పీటీ వారెంట్‌తో కోర్టులో ప్రవేశ పెట్టాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణ నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు వల్లభనేని వంశీని పీటీ వారెంట్‌పై విజయవాడ జైలు నుంచి ఆగరిపల్లి మీదుగా నూజివీడు కోర్టుకు తరలిస్తున్నారు.






