తిరుమలలో ఊహించని ఘటన.. భక్తులకు రాష్ట్రపతి ముర్ము చాక్లెట్స్ పంపిణీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-21 10:54:54  IST  )

తిరుమలలో ఊహించని ఘటన జరిగింది....

తిరుమలలో ఊహించని ఘటన.. భక్తులకు రాష్ట్రపతి ముర్ము చాక్లెట్స్ పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో ఊహించని ఘటన జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో రాంభగీచ సర్కిల్(Rambhageecha Circle) వద్ద ప్రోటో కాల్ పక్కన పెట్టి మరీ భక్తులకు రాష్ట్రపతి ముర్ము చాక్లెట్స్ పంపిణీ చేశారు. రోడ్డు పక్కన నిల్చున్న భక్తుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేయడంతో పాటు చాక్లెట్స్ సైతం అందజేశారు. దీంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయిన ఉండి చాలా సింపుల్‌గా, హడావుడి లేకుండా తమకు దగ్గరకు వచ్చి చాక్లెట్స్ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.

Next Story