శ్రీశైలం రోడ్డులో ప్రమాదం.. అదుపు తప్పి గుంతలోకి ఒరిగిపోయిన RTC బస్సు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-16 12:56:34  IST  )

నంద్యాల జిల్లా శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గుంతలోకి ఒరిగిపోవడంతో ప్రయాణికులు అతి కష్టం మీద బయటకు వచ్చారు...

శ్రీశైలం రోడ్డులో ప్రమాదం.. అదుపు తప్పి గుంతలోకి ఒరిగిపోయిన RTC బస్సు
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డు(Srisailam Dornala Ghat Road)లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒక్కసారిగా ఒరిగిపోయింది. అయితే ప్రమాణికులంతా సురక్షింతంగా ఉన్నారు. కాకపోతే అతి కష్టం మీద బస్సు నుంచి బయటకువచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న కొంతమంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. క్రేన్ సాయంతో ఆర్టీసీ బస్సు(Rtc Bus)ను రోడ్డుపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

Next Story