- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap News: ప్రభుత్వ కార్యాలయాన్ని బార్‌గా మార్చిన అధికారి.. తిట్టి పోస్తున్న నెటిజన్లు
ప్రభుత్వ కార్యాలయాన్ని దేవాలయంగా భావించాల్సిన ఓ అధికారి బార్ గా మార్చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ కార్యాలయాన్ని(Government Office) దేవాలయంగా భావించాల్సిన ఓ అధికారి బార్(Bar)గా మార్చేశారు. తన సహచరులతో కలిసి మద్యం సేవించారు. అక్కడ పని చేస్తున్న అటెండర్స్‌ను మందు సప్లయర్స్‌గా మార్చి వారితో సేవలు చేయించుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విజయనగరం జిల్లా బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం(Bobbili Irrigation Circle Office)లో సూపరింటెండెంట్‌గా సురేశ్ పని చేస్తున్నారు. ఆయనకు మద్యం అలవాటు ఉంది. వైన్స్‌లో తాగడం కంటే తన సొంత కార్యాలయంలోనే మందు సేవిస్తూ ఆ కిక్కే వేరప్ప అని సురేశ్ అంటున్నారు. ప్రతి రోజూ తన కార్యాయలంలో మందు తాగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తనతో పాటు మరికొందరినీ కార్యాలయానికి తీసుకొచ్చి బార్‌గా మార్చేశారు. మద్యం, కూల్ డ్రింక్స్, స్టఫ్ ఎదురుగా పెట్టుకుని సిట్టింగ్ వేశారు. ఇక్కడ సప్లయర్ ఎవరో కాదు.. ఆ కార్యాలయంలో పని చేసే అటెండర్స్. అంతా కలిసి ప్రభుత్వ కార్యాలయాన్ని బార్ మార్చేశారు. ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందని, లేదంటే ఇంతకుముందు మాదిరిగానే ఇప్పుడు కూడా ఈ ఘటన మరుగునపడిపోయి ఉండేదని ఈ వీడియో చూసిన వాళ్లు, నెటిజన్లు అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయానికి సొంత పనులకు ఉపయోగించుకోకుడదనే నిబంధన ఉన్నా.. మద్యం సేవించారంటే వారికి విధుల పట్ల ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుందని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం కార్యాలయంలో మద్యం తాగిన ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకోవడమే కాకుండా ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






