IPS Uday KrishnaReddy : ఆఫీసర్ అవమానం... పట్టుదలతో ఆ యువకుడు సాధించి చూస్తే వావ్ అనకుండా ఉండలేరు

by Muthe.Rajitha |   (  Updated:2025-05-05 15:12:02  IST  )

అతనో సాధారణ కానిస్టేబుల్(Constable). అందరూ చూస్తుండగా ఓ పోలీస్ ఉన్నతాధికారి తనను అవమానించడాన్ని(Officer Insult) అతను ఏమాత్రం తీసుకోలేకపోయాడు.

IPS Uday KrishnaReddy : ఆఫీసర్ అవమానం... పట్టుదలతో ఆ యువకుడు సాధించి చూస్తే వావ్ అనకుండా ఉండలేరు
X

దిశ, వెబ్ డెస్క్ : అతనో సాధారణ కానిస్టేబుల్(Constable). అందరూ చూస్తుండగా ఓ పోలీస్ ఉన్నతాధికారి తనను అవమానించడాన్ని(Officer Insult) అతను ఏమాత్రం తీసుకోలేకపోయాడు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని ఫిక్సయి కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కు ప్రిపేరవ్వడం ప్రారంభించాడు. అలా వరుసగా మూడు సార్లు విఫలమైనా పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టుదలతో చదివి నాలుగో ప్రయత్నంలో ఆల్ ఇండియా 780వ ర్యాంకు, ఐదో ప్రయత్నంలో 350 ర్యాంకుతో ఐపీఎస్(IPS) సాధించి ఔరా అనిపించిన ఉదయ్ కృష్ణారెడ్డి(Uday KrishnaReddy).

ఆంధ్రప్రదేశ్(AP)లోని ప్రకాశం జిల్లా(Prakasham District) సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెంలో ఒక సాధారణ కుటుంబంలో ఉదయ్ జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకున్నాడు. అప్పటినుంచి ఉదయ్, తన తమ్ముడు ప్రణయ్ ని నాయనమ్మ రమణమ్మ చేరదీసింది. కూరగాయల వ్యాపారం చేస్తూ తన ఇద్దరి మనవళ్లును ఎంతో కష్టపడి చదివించింది. నాయనమ్మ కష్టాలను స్వయంగా చూసిన ఉదయ్ చిన్నపటి నుంచే ఎంతో పట్టుదలతో చదివేవాడు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తి చేశాడు.ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టి 2013లో మొదటి ప్రయత్నంలో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు.

ఆ ఉద్యోగంలో ఓసారి తన పై అధికారి అందరి ముందు అవమానించడంతో.. ఎలాగైనా తాను కూడా ఐపీఎస్ కావాలి అని గట్టిగా అనుకున్నాడు. అయితే కుటుంబ పరిస్థితి దృష్ట్యా 2019 వరకు అదే ఉద్యోగం చేశాడు. అనంతరం సివిల్స్ మీద గురిపెట్టినప్పటికీ.. ఎంత చదివినా వరుసగా మూడుసార్లు సివిల్స్ సాధించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా అలానే పట్టుదలతో చదివి 2023లో UPSC వెల్లడించిన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించి IRS కు ఎంపికయ్యాడు. అయితే తన ఆశయం IRS కాదని IAS లేదా IPSలో చేరడమే తన లక్ష్యమని ప్రిపరేషన్ ఆపకుండా అలానే కొనసాగించి ఐదోసారి కూడా సివిల్స్ కు ప్రయత్నించాడు. ఇటీవల UPSC విడుదల చేసిన ఫలితాల్లో ఉదయ్ కృష్ణారెడ్డి ఈసారి ఆల్ ఇండియా 350 ర్యాంక్ సాధించి IPS కు సెలెక్ట్ అయి చివరకు తాను అనుకున్నది సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.

Next Story