ఏసీబీ వలలో ఎమ్మార్వో.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కు

by Vemula.Srinu Prasad |

రెవెన్యూ పని కోసం లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట ఎమ్మార్వో కార్యాలయంలో జరిగింది. పాస్ బుక్‌లో పేరు సవరణ కోసం రైతు కృష్ణా రెడ్డి ఎమ్మార్వో శాంతి స్వరూప్‌ను ఆశ్రయించారు....

ఏసీబీ వలలో ఎమ్మార్వో.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కు
X

దిశ, వెబ్ డెస్క్: రెవెన్యూ పని(Revenue Work) కోసం లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వో(Mro) ఏసీబీ అధికారుల(Acb Officials)కు అడ్డంగా దొరికిపోయారు. ఈ నెల్లూరు జిల్లా(Nellore District) ఏఎస్‌పేట ఎమ్మార్వో కార్యాలయం(AS Peta MRO Office)లో జరిగింది. పాస్ బుక్‌లో పేరు సవరణ కోసం రైతు కృష్ణా రెడ్డి ఎమ్మార్వో శాంతి స్వరూప్‌ను ఆశ్రయించారు. సమస్యను వివరించారు. అయితే పని పూర్తి చేసేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని ఎమ్మార్వో కోరారు. లంచం ఇచ్చుకోలేని బాధితుడు కృష్ణా రెడ్డి ఏబీసీ అధికారులను కలిశారు. ఎమ్మార్వో లంచం బాగోతాన్ని వివరించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం ఏఎస్ పేట ఎమ్మార్వో కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా ఎమ్మార్వో శాంతి స్వరూప్‌ను పట్టుకున్నారు. ఎమ్మార్వో తీసుకున్న లంచం సొమ్మును రసాయన పరీక్షల ద్వారా స్వాధీనం చేసుకున్నారు. సదరు ఎమ్మార్వోపై తదుపరి చర్యలకు ఆదేశించారు.

Next Story