- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janasena:‘డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణానికి ఏడాది’.. ఆసక్తికర వీడియో రిలీజ్!
ఏపీలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించి రికార్డు సృష్టించింది.
ఈ క్రమంలో జూన్ 12, 2024న ఏపీ(Andhra pradesh) డిప్యూటీ సీఎంగా, మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ తరుణంలో ‘‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను’’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసి ఏడాది పూర్తవుతుంది.
ఈ సందర్భంగా జనసేన పార్టీ(Janasena) సాధించిన ప్రగతి, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో పలు కీలక సన్నివేశాలతో ఓ స్పెషల్ వీడియోను జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. ఆ వీడియోలో పిఠాపురంలో ఆయన సాధించిన తొలి ఎన్నికల విజయం. ఆ ప్రాంతంలో పార్టీకి 100 శాతం స్ట్రైక్ రేట్ అందించిన తీరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను ఆయన తిరగరాసిన విధానం వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే పవన్ కల్యాణ్ సహనం, పట్టుదల గురించి వివరించారు.






