ఎంతవారించినా ఒప్పుకోని లోకేశ్.. అసెంబ్లీలో అరుదైన దృశ్యం

by Vemula.Srinu Prasad |

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర ఘటన జరిగింది..

ఎంతవారించినా ఒప్పుకోని లోకేశ్.. అసెంబ్లీలో అరుదైన దృశ్యం
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కుమారుడు. కానీ అలా ఉండరు. యువగళం(Yuvagalam)కు ముందు ఆ తర్వాత అనేలా తన వ్యవహార శైలీలో మార్పులు చేసుకున్నారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూ తన వాళ్ల పట్ల వినయం, విధేయతో నడుచుకుంటున్నారు. రాజకీయ సందర్భాన్ని బట్టి సలహాలు, సూచనలు ఇస్తూ సహచరులతో భేష్ అనిపించుకుంటున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల విమర్శలు ఎలా ఉన్నా వ్యక్తిగత నడవడికలో మంత్రి నారా లోకేష్ ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తున్నారు. జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా కలిసిపోతున్నారు. తన కంటే చిన్నవారితో కలివిడిగా ఉంటూ పెద్దవారిపట్ల అపారమైన అప్యాతయను చాటుతున్నారు. ఇలా యువనేతలకు లోకేశ్ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి అసెంబ్లీ ప్రాంగణంలో చోటు చేసుకుంది. ఈ అరుదైన దృశ్యం చూసి ప్రతి ఒక్కరూ శెభాష్ ‘లోకేశ్’ అని అంటున్నారు.

సంప్రదాయ గౌరవానికి ప్రతీకగా నిలిచిన లోకేశ్

గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు జరిగింది. ప్రశ్నలు, సమాధానాలతో ఉభయ సభలు సాగాయి. చివరికి సమయంలో అయిపోవడంతో సభలు వాయిదా పడ్డాయి. దీంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ నుంచి ఇంటికి బయల్దేరారు. ఇంతలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సభ ముగిశాక వెళ్తున్న స్పీకర్‌ను లోకేశ్ కలిశారు. ఆయనతో పాటు కారు వరకూ వెళ్లారు. తనతో రావద్దని అయ్యన్నపాత్రుడు వారించినప్పటికీ మర్యాదపూర్వకంగా కారు వరకు వెళ్లి సాగనంపారు. స్వయంగా స్పీకర్‌ను కారెక్కించి వీడ్కోలు పలికిన ఈ దృశ్యం రాజకీయాల్లో పెద్దల పట్ల ఉండాల్సిన సంప్రదాయ గౌరవానికి ప్రతీకగా నిలిచింది. మరోవైపు మంత్రి లోకేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు పట్ల చూపిన గౌరవం అందరినీ ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన టీడీపీ కార్యకర్తలు.. ‘దటీజ్ లోకేశ్’ అంటూ కితాబిస్తున్నారు.

Next Story