కుమార్తెకు ఇచ్చిన ఆస్తి తిరిగి ఇప్పించాల‌ని వృద్ధురాలు ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

పెంచిన కూతురికిచ్చిన ఆస్తిని తిరిగి ఇప్పించాలని కలెక్టర్‌కు వృద్ధురాలు ఫిర్యాదు చేసిన ఘటన అమలాపురం మొగ‌ళ్లమూరులో జరిగింది..

కుమార్తెకు ఇచ్చిన ఆస్తి తిరిగి ఇప్పించాల‌ని వృద్ధురాలు ఫిర్యాదు
X

దిశ, అమ‌లాపురం: క‌న్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పది అంటారు.. స‌రిగ్గా ఇలాగే త‌మ‌కు పిల్లలు లేర‌న్న లోటు తీర్చుకునేందుకు స‌మీప బంధువుల కుమార్తెను పెంచి పెద్ద చేసి బాగా చ‌దివించి త‌మ‌కున్న ఆస్తినంతా రాసిచ్చిన త‌రువాత తీరా వృధ్యాప్యంలో చూడ‌ను పొమ్మంటుంద‌ని ఓ వృద్ధురాలు జిల్లా క‌లెక్టర్‌కు సోమ‌వారం మొగ‌ళ్లమూరు గ్రామానికి చెందిన వాస‌ర్ల ల‌క్ష్మి అనే వృద్ధురాలు ప్రజాఫిర్యాదుల వేదిక‌లో ఫిర్యాదు చేసింది.. త‌న భ‌ర్త ఉండ‌గా ఇద్ద‌రం కలిసి వ‌చ్చి త‌మ పెంపుడు కుమార్తెపై ఫిర్యాదు చేశామ‌ని, అయితే ఇప్ప‌టికీ త‌న‌కు న్యాయం చేయ‌లేద‌ని ఆ వృద్ధురాలు వాపోయింది.. మొగళ్ల‌మూరు గ్రామానికి చెందిన వాస‌ర్ల వెంక‌ట న‌ర్స‌య్య, ల‌క్ష్మీ దంప‌తులమైన తాము త‌మ పెంపుడు కుమార్తె వాసంశెట్టి జ్యోతి అనే ఆమెపై గ‌తంలో ఫిర్యాదు చేశామ‌ని, అయితే ఇటీవ‌ల ఆమె వేధింపులు మ‌రింత ఎక్కువై మాన‌సిక వేద‌న‌కు గురైన‌ త‌న భ‌ర్త మృతిచెందాడ‌ని, ఒంటరిగా మిగిలిన‌ త‌న‌కు త‌న భ‌ర్త క‌ష్టార్జిత‌మైర‌న ఆస్తిని తిరిగి ఇప్పించి న్యాయం చేయాల‌ని వృద్ధురాలు వాస‌ర్ల ల‌క్ష్మి ఫిర్యాదులో పేర్కొంది.

తన భ‌ర్త ఆసుప‌త్రి పాలైన స‌మ‌యంలో క‌నీసం వ‌చ్చి చూడ‌లేద‌ని, ఆయ‌న మృతిచెందాక వ‌చ్చి ఆస్తి కోసం త‌న‌ను దూషిస్తూ గొడ‌వ‌కు దిగింద‌ని తెలిపింది. త‌న భ‌ర్త మృతిచెంది ఒంట‌రిగా జీవ‌నం సాగిస్తున్న వృద్ధురాలినైన‌ త‌న‌కు జిల్లా క‌లెక్ట‌ర్ వేగంగా విచార‌ణ పూర్తిచేసి త‌న భ‌ర్త ఆమెకు రాసిచ్చిన రెండున్న‌రెక‌రాల దానసెట‌ల్మెంట్ రిజిస్ట్రేష‌న్‌ను ర‌ద్దుచేసి త‌న‌కు ఇప్పించాల‌ని కోరింది.. అంతే కాకుండా ఒంట‌రిగా జీవిస్తున్న త‌న పెంపుడు కుమార్తె నుంచి త‌నకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది..

Next Story