వాగులో ఊహించని ప్రమాదం.. యువకుల కోసం గాలింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-14 10:27:44  IST  )

వాగులో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో కొట్టుకుపోయిన ఘటన మన్యం జిల్లాలో జరిగింది...

వాగులో ఊహించని ప్రమాదం.. యువకుల కోసం గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: వాగు(Brook)లో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో కొట్టుకుపోయిన ఘటన మన్యం జిల్లా(Manyam District)లో జరిగింది. విజయవాడ(Vijaywadad)కు చెందిన కటకం రవితేజ, సాధిష్.. మారేడుమిల్లి మండలం వాలమూరు వెళ్లారు. అయితే స్థానికంగా ఉన్న పాములేరు వాగు వద్దకు వెళ్లారు. వాగులోకి దిగి స్నానం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలో ప్రమాదవశాత్తు కాలు జారీ వాగులో గల్లంతయ్యారు. వెంటనే నీటిలో కొట్టుకుపోయారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు వాళ్లు ఘటనా స్థలానికి వెళ్లారు. వాగులో కొట్టుకుపోయిన యువకుల కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో పాములేరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story