SMME: ఏపీలో ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త

by Thanuru Gopichand |

ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్తను తయారుచేయడం కోసమే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎస్ఎంఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్తె లిపారు

SMME: ఏపీలో ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్తను తయారుచేయడం కోసమే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎస్ఎంఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani) తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో (Gottipati) కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పెద్దాపురంలో ఎస్ఎgఎస్ఇ ఇండస్ర్టీయల్ పార్క్ ను మంత్రి అనగాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడన్నారు. ఉపాధి కల్పన తోపాటు ఆర్ధికంగా రాష్ర్టాన్ని నెంబర్ వన్ గా నిలిపేందుకు ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదాన్ని చంద్రబాబు ఇచ్చారని తెలిపారు.

గతంలో ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి అని చంద్రాబాబు పిలుపునిస్తే చాలా మంది నవ్వారు. కానీ ఫలితాలను మనం గత 20 ఏళ్లలో చూశామన్నారు. విజన్ 2047 (Vision) ద్వారా స్వర్ణాంధ్ర (Swarnandhra)సాధించాలంటే పారిశ్రామిక రంగంలోనూ ప్రగతి చాలా అవసరం అని తెలిపారు. ఎస్ఎమ్ఎమ్ఇ పార్కుల ఏర్పాటు కారణంగా ఉపాధి కల్పన జరగడమే కాకుండా ఆర్ధికంగానూ రాష్ర్టం పరిపుష్ణమౌతుందన్నారు. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలుగా మారే యువతను ప్రోత్సహించేందుకు పెట్టుబడినిధిలో, విద్యుత్ బిల్లుల్లో తోపాటు అనేక అంశాల్లో రాష్ర్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోందని అన్నారు

Next Story