TTD:ఈ నెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసర భేటీ.. కారణమిదే!

by Jakkula.Mamatha |

టీటీడీ(TTD) పాలక మండలి జనవరి 31న అత్యవసర సమావేశం కానుంది.

TTD:ఈ నెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసర భేటీ.. కారణమిదే!
X

దిశ,వెబ్‌డెస్క్: టీటీడీ(TTD) పాలక మండలి జనవరి 31న అత్యవసర సమావేశం కానుంది. టీటీడీ ఛైర్మన్(TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu) ఆధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సభ్యులు, అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల తిరుపతి(Tirupati) తొక్కిసలాట ఘటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లపై టీటీడీ సభ్యులు, అధికారులతో పాలకమండలి పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. భక్తుల సౌకర్యాల పై అధికారులకు టీటీడీ ఛైర్మన్ కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. అయితే రథసప్తమి రోజున ఏడు వాహనాలపై స్వామి వారు భక్తులకు(Devotees) దర్శనమివ్వనున్నారు. అటు ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలును రద్దు చేశారు.

Next Story