- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nellore: గురుకుల పాఠశాలలో వెట్టిచాకిరి
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలో దారుణం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలో దారుణం జరిగింది. గురుకుల పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. హెస్టర్ మాస్టర్ హుకుంతో హాస్టల్ విద్యార్థులు తెల్లవారుజామునే లేచి చపాతీలు తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ ఐదు నుంచి 10 మంది విద్యార్థులకు చపాతీల తయారీ పనిని అప్పగిస్తున్నారు. దీంతో రాత్రంతా పాఠశాలలోనే నిద్రపోయి ఉదయాన్నే లేచి విద్యార్థులు చపాతీలు తయారు చేస్తున్నారు. మరికొందరు విద్యార్థులతో పాఠశాల ప్రాంగణాన్ని ఊడ్చి, శుభ్రం చేయించడంతో పాటు ఇతర పనులు సైతం చేయిస్తున్నారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో పాఠశాల సిబ్బందిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు.. విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించడమేంటని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హెడ్ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే పాఠశాలలో సిబ్బంది కొరత ఉందని, ఇందువల్లే విద్యార్థులతో చపాతీలు తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇలానే విద్యార్థులతో వెట్టి చాకిరి చేయించినట్లు ప్రచారం జరగడంతో అధికారులు అప్పట్లో చర్యలు తీసుకున్నారు. కొన్ని రోజులు సెలైంట్‌గా ఉండి... తాజాగా విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించడం మొదలు పెట్టారు. మరోవైపు పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉంటుందని, పిచ్చి మొక్కలు మొలిచాయని, రాత్రి సమయంలో హాస్టల్‌లోకి పాములు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా బోధన కూడా అంతంతమాత్రమేనని అంటున్నారు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలో మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ కొంతమంది సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని పలువురు నాయకులు విమర్శలు చేస్తున్నారు.






