- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ హాస్పిటల్‌లో దారుణం.. జనరల్ చెకప్ కోసం వెళ్లిన ఏడు నెలల గర్భిణీ మృతి
ప్రైవేటు హాస్పిటల్‌లో దారుణం జరిగింది. ..

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేటు హాస్పిటల్‌లో దారుణం జరిగింది. జనరల్ చెకప్ కోసం వెళ్లి గర్భిణీ మృతి చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కాలేజ్ రోడ్డులో జరిగింది. ఏడు నెలల గర్భిణీ మల్లేశ్వరి మంగళవారం ఆస్పత్రికి వెళ్లారు. ఈ రోజు ఉదయం వరకూ కూడా ఆమె చికిత్స తీసుకున్నారు. అయితే మంగళవారం మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇంజక్షన్ వికటించడం వల్లే మల్లేశ్వరి మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రి యాజమాన్యం అడిగిన డబ్బులు మొత్తం చెల్లించామని, బయటకు వెళ్లి వచ్చే సరికి తన భార్య మృతి చెందారని మల్లేశ్వరి భర్త ఆరోపించారు. వైద్యులు నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే మృతి చెందిన గర్భిణీ బుక్డ్ కేస్ కాదని, మొత్తం చెకప్‌లన్ని విజయవాడలో చేయించుకున్నారని ఆస్పత్రి వైద్యురాలు దుర్గ తెలిపారు. ‘‘మంగళవారం మా ఆస్పత్రిలో చెకప్‌కు వచ్చారు. బ్లడ్ టెస్ట్ చేశాం. బుధవారం రిపోర్ట్సు వచ్చాయి. బ్లడ్‌లో బాగా ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు వచ్చింది. ఉమ్మనీరు కూడా తక్కువగా ఉంది. ఇన్ ఫెక్షన్ తగ్గేందుకు ఇంజెక్షన్ ఇచ్చాం. ఆ తర్వాత మల్లేశ్వరి ఆరోగ్యంగానే ఉన్నారు. ట్రీట్‌మెంట్ అయిపోయిందని వెళ్లిపోవాలని చెప్పాం. తిన్న తర్వాత వెళ్లిపోతామని చెప్పారు. తిన్న తర్వాత గ్యాస్ పెరిగిందని చెప్పారు. దీంతో గ్యాస్ ట్యాబ్లెట్ వేశాం. ఆ తర్వాత సడెన్‌గా బీపీ ఎక్కువగా పెరిగింది. బీపీ 160 వరకు వెళ్లింది. నేను వచ్చే సరికి ఆమెకు ఫిట్స్ వచ్చాయి. చికిత్స చేసినా ఫిట్స్ తగ్గలేదు. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయారు.’’ అని వైద్యురాలు దుర్గ తెలిపారు.






